“పిల్లల భద్రత – డ్రగ్స్‌కు అడ్డుకట్ట” కార్యక్రమంలో ఎస్పీ కీలక సందేశం

G Rajashekar
By -
0



EB NEWS/భద్రాద్రి కొత్తగూడెం:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన *“పిల్లల భద్రత – డ్రగ్స్‌కు అడ్డుకట్ట”* అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత, ముఖ్యంగా విద్యార్థులు డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు.


విద్యార్థి దశలోనే మంచి లక్ష్యాలను ఏర్పరచుకుని భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆయన అన్నారు. మాదకద్రవ్యాలు అలవాటు అయితే వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా కుటుంబం, సమాజం కూడా తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరించారు.


చిన్న వయసులోనే చెడు అలవాట్లకు లోనుకాకుండా జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా డ్రగ్స్ విక్రయాలు లేదా వినియోగం గురించి సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. డ్రగ్స్ నిర్మూలనకు సమాజం మొత్తం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఎస్పీ పేర్కొన్నారు.





إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)