Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రెడీ.. మరో మూడు రోజుల్లో జమ

G Rajashekar
By -
0

 


EB NEWS/భద్రాద్రి:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతులకు కీలకమైన ప్రకటన వెలువడింది. యాసంగి సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రైతు భరోసా నిధులను ఈ నెల 22వ తేదీ నుంచి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది.


జిల్లాలోని 1.91 లక్షల మంది రైతులకు మొత్తం రూ.353.78 కోట్లు విడుదల చేయనున్నారు. ఎకరానికి రూ.6 వేల చొప్పున సాయం అందించబడుతుండగా, ముందుగా చిన్న, సన్నకారు రైతుల ఖాతాల్లోనే నిధులు జమ చేసేలా ప్రణాళిక రూపొందించారు.


ఇప్పటికే పంటల కోసం పెట్టుబడుల భారం మోస్తున్న రైతులకు ఈ నిధులు సమయానికి అందడం వల్ల కొంత ఆర్థిక ఒత్తిడి తగ్గనుంది. ముఖ్యంగా యాసంగి పనులు ఊపందుకుంటున్న ఈ సమయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రైతులకు ఉపయోగపడనుందని అధికారులు చెబుతున్నారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)