గల్ఫ్ దేశాల్లో తెలుగువారు.. కుటుంబాల్లో ఆవేదన!



 EB News:


పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న తెలుగువారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. ముఖ్యంగా Tehran లో చదువుకుంటున్న హైదరాబాద్ పాతబస్తీకి చెందిన విద్యార్థులు, అలాగే గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన కార్మికులు భయాందోళనలకు గురవుతున్నారు.


ఇటీవల పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారడంతో Israel లో నివసిస్తున్న తెలుగువారు రక్షణ బంకర్లలో తలదాచుకుంటున్నారు. అక్కడి నుంచి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నప్పటికీ, ఎప్పటికప్పుడు సైరన్లు మోగుతుండటంతో భయం నెలకొంది.


ఇక ఇక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “పిల్లలు సురక్షితంగా ఉన్నారనే సమాచారం వస్తున్నా మనసుకు నెమ్మది లేదు” అని పలువురు తల్లిదండ్రులు చెబుతున్నారు.


ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు తీసుకునే అవకాశముంది.


పశ్చిమాసియాలో పరిస్థితులు ఎటు దారితీస్తాయోనన్న అనిశ్చితి నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లోని తెలుగువారితో పాటు వారి కుటుంబాల్లో కూడా ఆందోళన వాతావరణం కొనసాగుతోంది.


Post a Comment

కొత్తది పాతది