భద్రాద్రి: కోడి పందాల స్థావరాలపై పోలీసుల దాడి.. ఏడుగురు అరెస్ట్



 EB NEWS/దమ్మపేట

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం దురదపాడు గ్రామ శివారులో కోడి పందాలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు ఆకస్మిక దాడి చేసి ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి  సమాచారం మేరకు దమ్మపేట ఎస్ఐ సాయి కిషోర్ నేతృత్వంలో పోలీసులు దాడి నిర్వహించారు.


ఈ సందర్భంగా కోడి పందాలు ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రెండు కోడిపుంజులు, రూ.8 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయి కిషోర్ తెలిపారు.


ఎవరైనా జూద కార్యకలాపాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.




Post a Comment

أحدث أقدم