పరుగెత్తండి… రూ.5,016 గెలుచుకోండి! ఏడూళ్లబయ్యారంలో 2కే రన్




EB NEWS/పినపాక:


 ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఏడూళ్లబయ్యారంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ‘2కే రన్’ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది.


వన్యప్రాణుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ పరుగు పోటీ ప్రధాన ఉద్దేశమని రేంజ్ అధికారులు తెలిపారు. ప్రకృతి, అడవులు, వన్యజీవాల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనే సందేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు.


పరుగులో విజేతలకు నగదు బహుమతులు అందజేయనున్నారు. మొదటి బహుమతిగా రూ.5,016, రెండో బహుమతిగా రూ.3,016, మూడో బహుమతిగా రూ.1,016 ప్రదానం చేయనున్నారు.


ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు తెలుపు రంగు టీషర్ట్, లోయర్ ధరించి సమయానికి హాజరుకావాలని అధికారులు కోరారు. విద్యార్థులు, యువత, ప్రకృతి ప్రేమికులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


Post a Comment

కొత్తది పాతది