ఆదిలాబాద్‌లో హౌసింగ్ ఇంజనీర్ లంచం కేసులో ఏసీబీ అరెస్ట్.

 


ఆదిలాబాద్ జిల్లా, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల గృహనిర్మాణ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ (అవుట్‌సోర్సింగ్) దుర్గం శ్రీకాంత్‌ను తెలంగాణ అవినీతినిరోధక శాఖ అధికారులు లంచం తీసుకుంటూ పట్టుకున్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటి ఫోటోలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం, బిల్లులు మంజూరు చేయడానికి రూ.10,000 లంచం డిమాండ్ చేసిన ఆయన అదే మొత్తాన్ని స్వీకరిస్తుండగా అధికారులు దాడి చేసి అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే ప్రజలు వెంటనే ACBను సంప్రదించాలని అధికారులు సూచించారు. టోల్ ఫ్రీ నెంబర్ 1064తో పాటు వాట్సాప్, సోషల్ మీడియా, అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

Post a Comment

أحدث أقدم