అశ్వాపురం: ప్రెస్ యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక...

G Rajashekar
By -
0

 భద్రాద్రి కొత్తగూడెం తాజా వార్తలు:



    --- అధ్యక్షులు గా కల్లూరి నరసింహారావు, ప్రధాన కార్యదర్శిగా గడకారి రామకృష్ణ.


     --- జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయం: గౌరవ అధ్యక్షులు కూరపాటి చలపతిరావు.


EB NEWS: అశ్వాపురం ఫిబ్రవరి 15:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండల ప్రెస్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక విలేకరుల సమక్షంలో జరిగిన సమావేశంలో ప్రెస్ యూనియన్ నూతన బాధ్యులను ప్రకటించారు.

 

ప్రెస్ యూనియన్ అశ్వాపురం నూతన కార్యవర్గ వివరాలు:

 

గౌరవ అధ్యక్షులు: కూరపాటి చలపతిరావు( ప్రజా సాక్షి)

అధ్యక్షులు: కల్లూరు నరసింహారావు( దిశ పవర్)

ఉపాధ్యక్షులు: షేక్. నయీమ్( నేటి కేసరి)

ప్రధాన కార్యదర్శి: గడకారి రామకృష్ణ( తొలి వార్త)

కోశాధికారి: రామగిరి ఏకాంబరం(తెలంగాణం),

సహాయ కార్యదర్శి: కొల్లి నాగేశ్వరరావు( మెట్రో ఈవెనింగ్)

ప్రచార కార్యదర్శి: జిల్లేపల్లి ప్రకాష్ చారి( నినాదం)

కమిటీ సభ్యులు: గద్దల నాగేశ్వరరావు( మనస్సాక్షి గొంతుక ), సున్నం నరేష్( డిడి 9 వార్త), గద్దల గౌతమ్( మీ వార్త), బేతం రాము (నమస్తే వార్త), జూపల్లి ధ్రువ కుమార్( న్యూస్ 1).ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు కూరపాటి చలపతిరావు మాట్లాడుతూ.. జర్నలిస్టులందరూ ఐకమత్యంతో ఉండి వృత్తిపరమైన విలువలను కాపాడాలని సూచించారు. అనంతరం అధ్యక్షులు కల్లూరి నరసింహారావు మాట్లాడుతూ.. అశ్వాపురం మండలంలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని, ప్రభుత్వం నుండి అందాల్సిన సంక్షేమ ఫలాలు ప్రతి విలేకరికి అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

కార్యవర్గ ఎన్నిక అనంతరం నూతన సభ్యులకు పలువురు మండల నాయకులు, తోటి జర్నలిస్టులు శుభాకాంక్షలు తెలిపారు.


إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)