పినపాక: మిషన్ భగీరథ నీళ్ల సరఫరాకు అంతరాయం



పినపాక, EB న్యూస్:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ నందు 500 డిఐ పైప్లైన్ డ్యామేజ్ అయిందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం పినపాక , కరకగూడెం మండలం లోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ త్రాగు నీరు నిలిపివేస్తామని,  ప్రజలు అసౌకర్యానికి గురికావద్దని తెలిపారు. పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని, సాధ్యమైనంత త్వరలో నీటిని అందిస్తామని పేర్కొన్నారు.

Post a Comment

కొత్తది పాతది