గ్రేట్... చదువుతో ఉన్నత స్థానానికి చేరిన సింగరేణి అధికారి



మణుగూరు, EB న్యూస్:


చదువు, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని నిరూపించారు సింగరేణి మణుగూరు ఏరియా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ హెడ్ పశువుల రమేష్. ఇల్లందు ప్రాంతంలో జన్మించి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సింగరేణిలో సాధారణ ఉద్యోగిగా చేరిన రమేష్ అంచెలంచెలుగా ఎదిగి నేడు మణుగూరు ఏరియా ఫైనాన్స్ విభాగానికి హెడ్‌గా నియమితులయ్యారు.


ఈ సందర్భంగా భారతీయ బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు శ్రీ నల్ల రాధాకృష్ణ స్వయంగా మణుగూరుకు వచ్చి సోమవారం రమేష్‌ను శాలువాతో సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

కొత్తది పాతది