మేడారం హుండీలో వంద రూపాయల నోటుపై విచిత్ర కోరిక.. ఏం రాసారంటే...

మేడారం | ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్:


మేడారం హుండీలో — మనసులోని కోరికలు మనీ రూపంలో..


విచిత్రమైన కోరికలు, చిత్రమైన సన్నివేశాలు మనం సినిమాల్లో చూస్తుంటాం. కానీ ఒక భక్తుడు కోరిన కోరిక విధానం విచిత్రమైనదే అయినా, అది చదివితే గుండెను తాకేలా ఉంది.

మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర హుండీ లెక్కింపులో బయటపడిన ఒక వంద రూపాయల నోటు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఆ నోటుపై రాసిన మాటలు ఇవి...

"సమ్మక్క సారలమ్మ తల్లి… నా కొడుకు బారి నుండి నన్ను కాపాడండి."

అంటూ తనలోని బాధను, కోరికను డబ్బుతో పాటు సమర్పించాడు.

డబ్బు ఉండొచ్చు… కానీ మనశ్శాంతి లేకపోతే మనిషి గుండెలో ఉన్న బాధ ఇలా మాటల రూపంలో బయటపడుతుంది. ఈ భక్తుడు తల్లికి కానుకగా వంద రూపాయల నోటు వేసినా, ఆ నోటుపై తన జీవిత బాధను కూడా అర్పించాడు.

ఈ ఘటన చూస్తే ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

సమ్మక్క తల్లి దగ్గర భక్తులు ధనం మాత్రమే కాదు, తమ గుండెల్లో దాచుకున్న బాధలు, కోరికలు, ఆశలు కూడా సమర్పిస్తున్నారు.

డబ్బు జీవితాన్ని నడిపించొచ్చు… కానీ మనశ్శాంతిని మాత్రం ఇవ్వలేదని ఈ భక్తుని కోరిక ద్వారా స్పష్టంగా కనిపిస్తోంది.

అందుకే ఈ వంద రూపాయల నోటు ఇప్పుడు కేవలం కానుకగా కాదు — ఒక మనసులో దాగిన బాధకు ప్రతీకగా మారింది.

Post a Comment

కొత్తది పాతది