ఖమ్మం | ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్:
ఖమ్మం నగరంలోని కూరగాయల మార్కెట్‌లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ ప్రజా నాయకుడు తుమ్మల నాగేశ్వరావు సేవలకు ప్రశంసిస్తూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమం 44వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ పాలెపు విజయలక్ష్మి వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగింది. సుమారు రూ.95 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ మార్కెట్ ద్వారా 260 కుటుంబాలకు జీవనోపాధి కల్పించడంలో తుమ్మల నాగేశ్వరావు కీలక పాత్ర పోషించినట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, వ్యాపారస్తులు, మహిళలు, యువకులు, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. సీనియర్ నాయకులు మాట్లాడుతూ ప్రజలకు ఉపాధి కల్పించిన ఈ మార్కెట్ తెలంగాణలోనే గొప్ప చరిత్రగా నిలిచిందని కొనియాడారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి