బైక్ ప్రమాదం అప్డేట్… గాయపడిన యువకుడు మృతి

G Rajashekar
By -
0

 


EB న్యూస్: మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం తోగ్గూడెం వద్ద సమ్మక్క–సారలమ్మ గుడి సమీపంలో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన ఇద్దరిని మణుగూరు ఆసుపత్రికి తరలించగా, వారిలో వాగు మల్లారం గ్రామానికి చెందిన మణికంఠ (పండు) పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటి క్రితం కన్నుమూశాడు.

ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)