పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం తోగూడెం గ్రామంలో ప్రధాన రహదారిపై ఉన్న ప్రమాదకర మలుపు స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. మలుపు వద్దనే పాఠశాల ఉండటంతో చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి భద్రతా చర్యలు చేపట్టి ప్రమాదాలు నివారించాలని స్థానికులు కోరుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి