పిల్లలకు బోధన మెరుగుపరచాలి — విద్యా ప్రమాణాలపై ఐటిడిఏ పీవో

G Rajashekar
By -
0

 


దుమ్ముగూడెం, EB న్యూస్:


గిరిజన సంక్షేమ ఆధ్వర్యంలో నడుస్తున్న జీపీఎస్ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ సూచించారు. గురువారం దుమ్ముగూడెం మండలంలోని లింగాపురం, రాజగుంపు జీపీఎస్ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో స్వయంగా మాట్లాడి, ఉద్దీపకం వర్క్‌బుక్‌లోని అంశాలపై ప్రశ్నలు అడిగి వారి అభ్యాస స్థాయిని పరిశీలించారు. కొంతమంది విద్యార్థులు వర్క్‌బుక్ అంశాల్లో వెనుకబడి ఉన్నట్లు గమనించిన పీవో అసంతృప్తి వ్యక్తం చేశారు.

పునాది స్థాయి నుంచే బోధన బలోపేతం కావాలంటే ఉపాధ్యాయులు ప్రతి అంశాన్ని పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా బోధించాలని సూచించారు. నెల రోజుల తర్వాత మళ్లీ పాఠశాలలను సందర్శించి పురోగతిని సమీక్షిస్తానని తెలిపారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)