కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌లో మేయర్ పీఠం కోసం రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. 60 డివిజన్ల ఫలితాల్లో కాంగ్రెస్ 22, సీపీఐ 22 స్థానాలు గెలుచుకోవడంతో స్పష్టమైన మెజార్టీ ఏ పార్టీకి రాలేదు. దీంతో హంగ్ పరిస్థితి నెలకొంది.
బీఆర్‌ఎస్ 8, ఇండిపెండెంట్లు 6, బీజేపీ, సీపీఎం ఒక్కో స్థానంలో గెలిచాయి. మ్యాజిక్ ఫిగర్ 31కు చేరుకోకపోవడంతో ఇండిపెండెంట్లు కీలకంగా మారారు.
సీపీఐకి బీఆర్‌ఎస్ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్ కూడా మేయర్ పీఠం కోసం వ్యూహరచనలో ఉంది. ఇరు పార్టీలూ తమ తమ స్థాయిలో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, మేయర్ పదవిపై వివిధ ఫార్ములాలపై కూడా చర్చ జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
కొత్తగూడెం రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో, మేయర్ పీఠం చివరకు ఎవరి ఖాతాలోకి వెళ్తుందన్నది ఆసక్తిగా మారింది.

إرسال تعليق