మణుగూరు: 12న కార్మిక సంఘాల బంద్‌కు సీపీఐ సంపూర్ణ మద్దతు



మణుగూరు, EB న్యూస్:


ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే కార్మిక సంఘాల బంద్‌కు సీపీఐ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు సీపీఐ మణుగూరు పట్టణ కార్యదర్శి దుర్గ్యాల సుధాకర్ తెలిపారు. 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చడం వల్ల కార్మిక హక్కులు దెబ్బతింటున్నాయని ఆయన విమర్శించారు. ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.


బంద్‌ను విజయవంతం చేయడానికి కార్మికులు, పార్టీ మరియు ప్రజాసంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. గురువారం ఉదయం 9.30 గంటలకు మణుగూరు తహసీల్దారు కార్యాలయం వద్ద సమావేశం కావాలని కోరారు.

Post a Comment

కొత్తది పాతది