మణుగూరులో ఘరానా మోసం... ప్రిన్సిపాల్ కొడుకునని చెప్పి బైక్ తీస్కెళ్లి....

 


మణుగూరు, EB న్యూస్:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ వద్ద బైక్ చోరీ ఘటన చోటుచేసుకుంది. స్కూల్ ముగిసిన సమయంలో పిల్లలను తీసుకెళ్లడానికి వచ్చిన ఓ కుటుంబ సభ్యుడిని గుర్తు తెలియని వ్యక్తి మాయ మాటలతో మోసం చేశాడు.


“నేను ప్రిన్సిపాల్ గారి కొడును, ఒకసారి బైక్ ట్రయల్ వేస్తాను” అంటూ బైక్ తీసుకెళ్లిన అతను తిరిగి రాలేదు. కొంతసేపటి తర్వాత బాధితుడు తన బైక్ దొంగిలించబడినట్లు గుర్తించాడు. సీసీటీవీ ఫుటేజీలో పల్సార్ బైక్‌పై ఉన్న వ్యక్తి చోరీ చేసినట్లు నమోదైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



ఇది కూడా చదవండి...

ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు – రిమాండ్‌కు తరలింపు


మణుగూరు: విజయనగరం గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులపై మణుగూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు సీఐ పాటి నాగబాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.


సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం, గత ఆదివారం రాత్రి ప్రభుత్వ గిరిజన సహకార సంస్థకు చెందిన పెట్రోల్ బంకును ధ్వంసం చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


మణుగూరు డీఎస్పీ వి. రవీందర్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగిన విచారణలో ఏ1గా పాయం దని అన్వేష్, ఏ2గా గనిబోయిన సాత్విక్, ఏ3గా తాటి సాగర్, ఏ4గా కంటెం భాస్కర్, ఏ5గా గనిబోయిన నగేష్, ఏ6గా కూరం వంశీలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


అనంతరం ఈ ఆరుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, వారిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.


ఈ ఘటనపై మరింత విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Post a Comment

కొత్తది పాతది