మణుగూరు, EB న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం విజయనగరం వద్ద ప్రభుత్వ గిరిజన సహకార సంస్థకు చెందిన పెట్రోల్ బంక్‌పై అర్ధరాత్రి దాడి చేసి సిబ్బందిపై దాడి చేసి బంకును ధ్వంసం చేసిన ఘటనలో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు.
ఇంతకుముందు రూ.500 నోటు మార్పిడి విషయంలో సిబ్బందితో ఘర్షణకు దిగిన కొందరు వ్యక్తులు తమది ఇదే ఊరని చెప్పి దాడికి పాల్పడి బంకును ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.
నిందితుల నుంచి రూ.1,500 నగదు, నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
.jpg)
కామెంట్‌ను పోస్ట్ చేయండి