శబరిమల మకర జ్యోతి దర్శనం

 


శబరిమల, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


శబరిమలలో ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున భక్తులు అత్యంత ఆత్మీయంగా ఎదురుచూసే ఘట్టం మకర జ్యోతి దర్శనం. ఈ పవిత్ర క్షణంలో పొన్నాంబలమేడు కొండపై నుండి మూడుసార్లు మకర జ్యోతి దర్శనమిచ్చింది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన భక్తులు పరవశంతో కళ్ళ నిండా భక్తిని నింపుకున్నారు.

మకర జ్యోతి దర్శన సమయంలో శబరి గిరులు "స్వామియే శరణం అయ్యప్ప" నామస్మరణతో మార్మోగాయి. లక్షలాది మంది భక్తులు ఈ దివ్య దర్శనం కోసం భారీగా తరలివచ్చి, అయ్యప్ప స్వామి నామస్మరణతో శరణు ఘోషలు చేశారు. మకర జ్యోతిని దర్శించుకున్న భక్తుల హృదయాలు భక్తి, శాంతి, ఆనందంతో నిండిపోయాయి.

ఈ పవిత్ర దర్శనం అయ్యప్ప స్వామి కృపకు ప్రతీకగా నిలుస్తూ, భక్తుల జీవితాల్లో శుభం, ఐశ్వర్యం, మానసిక శాంతిని ప్రసాదిస్తుందని విశ్వసించబడుతోంది.

Post a Comment

أحدث أقدم