ఆదివాసీల గౌరవానికి ప్రతీకగా మేడారంలో కేబినెట్ భేటీ

G Rajashekar
By -
0

 


మేడారం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


ఈ నెల 18వ తేదీన తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ సమావేశం మేడారంలో జరగనుంది. సంప్రదాయానికి భిన్నంగా, కోయ ఆదివాసీల ఆరాధ్య దైవాలైన సమ్మక్క–సారలమ్మ దేవాలయ ప్రాంగణంలో ఈ సమావేశం నిర్వహించనుండటం విశేషం. 18వ తేదీ రాత్రి సీఎం రేవంత్ రెడ్డి మేడారంలోనే బస చేయనున్నారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు గౌరవం ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది. 19వ తేదీ ఉదయం సమ్మక్క–సారలమ్మ నూతన ప్రాంగణాల ప్రారంభం జరగనుంది. మేడారం దేవాలయానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి, కోయ సంప్రదాయాలకు అద్దం పట్టేలా గద్దెలను తీర్చిదిద్దడం ఆధ్యాత్మిక వైభవాన్ని పెంచనుంది.

భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో భద్రత, వసతులు, రవాణా ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేశారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)