భద్రాద్రి: ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
అశ్వాపురం మండలం మొండికుంట సమీపంలో శుక్రవారం ఉదయం KLR కాలేజీ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సుమారు 50-60 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పాల్వంచకు చెందిన KLR ఇంజినీరింగ్ కాలేజీ బస్సు మణుగూరు నుంచి పాల్వంచకు విద్యార్థులను తీసుకెళ్తుండగా, మొండికుంట అడవి ప్రాంతంలో రోడ్డు నుంచి దారి తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విద్యార్థులకు స్వల్ప గాయాలు, రక్తస్రావం జరిగింది. స్థానికులు 108 ఆంబులెన్స్‌లు వెంటనే చేరుకొని గాయపడినవారిని భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. సీఐ అశోక్ రెడ్డి సహాయం అందించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

إرسال تعليق