భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు.
19న మేడారం గద్దెలు, ప్రాంగణ పునరుద్ధరణ పనుల ప్రారంభోత్సవం.
గోవిందరావుపేట, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
తాడ్వాయి మండల పరిధి మేడారం సమ్మక్క -సారలమ్మ కు ఈనెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక సందర్భంగా అధికారులు సన్నాహాలు జరుగుతున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి సీతక్క తెలిపారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు రాష్ట్ర మంత్రులు మేడారానికి రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేయల ని సీతక్క అధికారులు సూచించారు,
ముఖ్యమంత్రి పర్యటణ సంబంధించిన ఏర్పాట్లపై బుధవారం మేడారం హరిత హోటల్‌లో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., జిల్లా ఎస్పీ రామ్‌నాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా, జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ లతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది, మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మేడారం చేరుకున్న అనంతరం రాత్రి మేడారంలోనిబస చేయనున్నారని తెలియజేశారు,
19వ తేదీన శ్రీ సమ్మక్క సారలమ్మ గద్దెలు, ప్రాంగణ పునరుద్ధరణ పనుల ప్రారంభోత్సవం చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.
18వ తేదీన రాష్ట్ర స్థాయి యంత్రాంగం మొత్తం మేడారంలోనే ఉండనున్నందున, ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అధికారులను కోరారు. 18వ తేదీ ఆదివారం కావడం, పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ముగియడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని, ఆ దృష్టితో ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు,
మేడారం అభివృద్ధి పనుల్లో సహకరిస్తున్న జిల్లా అధికారులు,
వారి బృందాలకు, జిల్లా ప్రజలకు సందర్భంగా భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు మంత్రి తెలిపారు.
ముందుగా జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ ముఖ్యమంత్రి రాక సందర్భంగా ప్రోటోకాల్, బందోబస్తు, వసతి, సాంస్కృతిక కార్యక్రమాలు, జాతర ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
హెలిప్యాడ్ నిర్వహణ పనులను ఆర్ అండ్ బీ శాఖకు అప్పగించడం జరిగిందన్నారు, మేడారం జాతరగద్దెల ప్రాంగణ పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీపీఓను ఆదేశించారు.
ముఖ్యమంత్రి, వీఐపీ ప్రోటోకాల్ బాధ్యతలను ఆర్డీఓ వెంకటేష్కు అప్పగించారు. ముఖ్యమంత్రి నిర్వహించే బహిరంగ సభకు జిల్లాలో ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపారు. అలాగే ఆదివాసీ సంస్కృతి ప్రతిబింబించేలా ధింసా, కోయ, గుస్సాడి, కొమ్ము కోయ తదితర సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
ముఖ్యమంత్రి భద్రత, రూట్ మ్యాప్, పార్కింగ్, గార్డ్ ఆఫ్ ఆనర్ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రామ్‌నాథ్ కేకన్ పర్యవేక్షించనున్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మహేందర్ జీ, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, ఆర్డీఓ వెంకటేష్, జిల్లా అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق