పినపాక:లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే యువకుడు మృతి... కేసు నమోదు



EB NEWS/పినపాక:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ఆటో నడుపుతున్న యువకుడు మర్రి సంజయ్ (ఎల్చిరెడ్డిపల్లి గ్రామ నివాసి) అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే.

ఈ ప్రమాదానికి లారీ డ్రైవర్ అజాగ్రత్తగా వాహనం నడపడం కారణమని మృతుని మేనమామ మద్దెబోయిన జంపయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.





Post a Comment

أحدث أقدم