జగిత్యాలలో దారుణం.. భార్యను సజీవ దహనం చేయాలన్న భర్త యత్నం

G Rajashekar
By -
0



EB NEWS/జగిత్యాల:


జగిత్యాల జిల్లా ధర్మపురిలో అనుమానం కారణంగా దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై భర్త పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన కలకలం రేపింది.


స్థానికుల సమాచారం ప్రకారం మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న నవీన్ తన భార్య రమ్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన నవీన్ భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.


ఈ ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన అత్తమామలపై కూడా దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన రమ్యను కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.


ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ వివాదం, అనుమానం ఈ ఘాతుకానికి కారణమా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. 


إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)