పినపాక: రాష్ట్రస్థాయి కబడ్డీ.. విజేతగా నిలిచిన ఖమ్మం

 


పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడుళ్ల బయ్యారం జాతీయ పాఠశాలలో నవంబర్ 8,  న జరిగిన రాష్ట్రస్థాయి అండర్-17 కబడ్డీ పోటీలకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కంది సుబ్బారెడ్డి మరియు సీఐ వెంకటేశ్వరరావు ప్రారంభం చేశారన్నారు.



పోటీల్లో బాలికల విభాగంలో తొలి మ్యాచ్‌లో ఖమ్మం జట్టు హైదరాబాద్ పై విజయాన్ని సాధించగా,  బాలుర విభాగంలో  వరంగల్  జట్టు నల్గొండపై  విజేతగా నిలిచింది.మొత్తం 10 జిల్లాల నుండి సుమారు 300 క్రీడాకారులు, 100 కోచ్‌లు మరియు రిఫరీలు ఈ పోటీలో పాల్గొంటారు. ప్రో కబడ్డీ మాదిరిగా పగలు మరియు రాత్రి ఫ్లడ్‌లైట్ క్రీడలు జరుగుతాయి. క్రీడాకారులకు కంది చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజనం, వసతి సదుపాయాలు కల్పించబడ్డాయి. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులు త్వరలో జాతీయ స్థాయి పోటీలకు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతినిది చేస్తారు.ఈ గెలుపు,  ఖమ్మం జట్టుకు మోటివేషన్ గా నిలిచింది మరియు పినపాక మండలంలో క్రీడాభివృద్ధికి మంచి భవిష్యత్తును సూచిస్తోంది.

Post a Comment

أحدث أقدم