పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం వచ్చే 33కెవి లైన్ మంగళవారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో మూడు చోట్ల ఇన్సులేటర్స్ ఫెయిల్ అవ్వడం వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్తు లైన్ చెరువు అవతల ఉండడం వల్ల విద్యుత్ సిబ్బంది తెప్ప సహాయంతో చెరువు దాటి విద్యుత్ సరఫరాని పునరుద్ధరించడం జరిగింది. విద్యుత్తు లైన్లో ఎలాంటి సమస్యలు ఏర్పడినా విద్యుత్ సిబ్బంది సాహసోపేతంగా పరిష్కరించడాన్ని మండల ప్రజలు విద్యుత్ సిబ్బందికి అభినందనలు తెలుపుతున్నారు . ఈ కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది లైన్మెన్ వెంకటరావు ఎఎల్ఎం కామేష్, స్వామి పాల్గొన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి