పినపాక: ఆధార్ అప్డేట్ కి 3000 రూపాయలు ఇవ్వాలంట.. నిలదీసిన జనం ఆ తర్వాత..

 


పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


పినపాక మండలం పొట్లపల్లి గ్రామంలో ఆదివారం ఒక వ్యక్తి ఆధార్ కార్డు అప్డేట్ చేస్తానంటూ గ్రామ ప్రజలను నమించే ప్రయత్నం చేశారు. ఆధార్ సవరణలు చేపిద్దామని కొందరు ధ్రువీకరణ పత్రాలు అతని వద్దకు తీసుకువచ్చారు. కానీ ఒక్కో అప్డేట్ కి దాదాపు 3 వేల రూపాయలు అనగా... ఆధార్ సెంటర్లలో వంద రూపాయలకే చేస్తుంటే నువ్వేంటి ₹3,000 అడుగుతున్నావని గట్టిగా నిలదీశారు. దీంతో ఆ వ్యక్తి బైక్ పై అక్కడ నుంచి పరారయ్యారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ తతంగాన్ని మొత్తం మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు. 




 మొబైల్ ఫోన్లో ఎవరైనా ఇలాంటి అప్డేట్లు చేస్తామని మీ వద్దకు వస్తే వెంటనే పోలీస్ స్టేషన్కు సమాచారం  అందించండి. 



సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతులలో ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరైనా ఆధార్ కార్డు అప్డేట్స్ చేసుకోవాలనుకుంటే సమీపంలో ఉన్న ఆధార్ సెంటర్ కి వెళ్లి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 

Post a Comment

కొత్తది పాతది