మణుగూరు: వర్షానికి సురక్ష బస్టాండ్ ఎలా ఉందో చూడండి( వీడియో)



మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:



 రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మణుగూరు మండలం సురక్ష బస్టాండ్ ప్రాంతంలో రహదారి మొత్తం జలమయం అయింది. దీనివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు ఈ సందర్భంగా కోరుతున్నారు.



మరి కొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది .


ఇది కూడా చదవండి...



ప్రజా దర్బార్ కార్యక్రమానికి హాజరు కావాలి: పీవో


భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో రేపు నిర్వహించే గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీవో రాహుల్ ఆదివారం ప్రకటించారు.


 ఉదయం 10:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని, గిరిజనులు తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదులను అందజేయాలని పీవో వెల్లడించారు.



Post a Comment

కొత్తది పాతది