పినపాక మండలంలో వడ్డీ వ్యాపారాల దందా..!

 

పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ ప్రతినిధి:


పినపాక మండల వ్యాప్తంగా వడ్డీ వ్యాపారాలు వడ్డీ పేరుతో పేద ప్రజల రక్తం పీల్చుకుంటున్నారనే చెప్పాలి. నిరుపేద ప్రజలనే టార్గెట్ చేసుకొని కొందరు వడ్డీ వ్యాపారులు  దాదాపు 10  రూపాయల వడ్డీకి డబ్బు ఇచ్చి వారం రోజుల వాయిదాలతో ముక్కు పిండి వసూళ్ళు చేస్తున్నారు. వాయిదా కట్టని పక్షంలో సదరు వడ్డీ వ్యాపారి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ... డబ్బు చెల్లించాల్సిందే అని కరాకండిగా చెప్తున్నారు. డబ్బు తీసుకున్న బాధితులు ఎందుకు తీసుకున్నావు రా ఈ అప్పు అని తలలు పట్టుకుంటున్నారు. సంబంధిత అధికారులు ప్రజల రక్తం పీరుస్తున్న వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలకు కళ్లెం వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు ఈ సందర్భంగా కోరుతున్నారు.

Post a Comment

కొత్తది పాతది