పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ ప్రతినిధి రాజశేఖర్:
పినపాక మండలం సీతంపేట గ్రామంలో రోడ్లమీద వర్షం నీరు నిలిచి రహదారి బురదమయంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో నడవాలంటే చాలా ఇబ్బంది కరంగా ఉందని, దీనివల్ల దోమలు వ్యాప్తి చెంది వ్యాధుల బారిన పడుతున్నామని వారు చెప్తున్నారు. దీంట్లోనే పశువుల వ్యర్ధాలు ఉండడంతో దుర్గంధం వస్తుందని అంటున్నారు. గ్రామ పంచాయతీ వారికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా కన్నెత్తి కూడా చూడట్లేదని ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్య గురించి పరుమార్లు దినపత్రికలలో ప్రచురితమైన కూడా స్పందించకపోవడంపై అధికారుల తీరుని అర్థం చేసుకోవచ్చు అని పలువురు ఆరోపిస్తున్నారు.చాలా కాలంగా ప్రజలు ఈ సమస్యతో నానా అవస్థలు పడుతున్నారని చెప్పాలి. సంబంధిత అధికారులు ఇప్పటికైనా మేల్కొని తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి