పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
పినపాక: మండలంలోని గోపాల్రావుపేట గ్రామంలో సోషల్ మీడియా ఇంచార్జ్ అచ్చా నవీన్ ఆధ్వర్యంలో దీపావళి పండుగ పురస్కరించుకొని మెగా వాలీబాల్ టోర్నీ నిర్వహించినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టోర్నమెంట్ లో మొదటి బహుమతి 30000 రూపాయలు రెండో బహుమతి 20000 రూపాయలు మూడో బహుమతి పదివేల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లా వాలీబాల్ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్విని చేసుకోవాలని కోరారు. అదేవిధంగా ఏ పంచాయతీ క్రీడాకారులు ఆ పంచాయతీలో మాత్రమే ఆడాలని తెలిపారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి