నకిలీ వే బిల్లులతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులు అరెస్టు

 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: 


అశ్వాపురం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:



తేదీ:08.10 2025న జగ్గారం X రోడ్ వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా TS30TA6498 అనే నంబర్ గల లారీ ఇసుక లోడుతో రాగా దానిని తనిఖీ చేయగా దాని డ్రైవర్ నాతి రాములు వే బిల్లును చూపించినాడు.దానిపై అనుమానం వచ్చి గట్టిగా అడగగా అది నకిలీ వే బిల్ అని దాన్ని తమ ఓనరు హైదరాబాద్ నకు చెందిన కర్నాటి శివశంకర్ ఇచ్చి పంపినాడని తెలిపినాడు.అలాగే రామానుజవరం ర్యాంపులో ఒక వ్యక్తి తనకు డిడి లేకుండా ఇసుక లోడ్ చేసినాడని తెలిపినాడు.దీనిపై లారీని సీజ్ చేసి cr. no. 189/2025 U/Sec 318(4),336(2), 340(2),r/w 3 (5) of BNS, కేసు నమోదు చేయనైనది రామానుజవరం ఇసుక ర్యాంపు నందు తనిఖీ చేయగా అక్కడ పనిచేసే టీజీఎండిసి కి సంబంధించిన ముగ్గురు ఉద్యోగులు దగ్గు నిఖిల్ దీప్,నాగేల్లి మధు,బుల్లెద్దు అనిల్ అనువారు డిడి లేకుండా ఇసుకను లారీలో లోడ్ చేసినారని అలాగే ఇసుకను లోడ్ చేసే జెసిబి డ్రైవర్ ఇరగదిండ్ల ఉపేందర్ దానిని లోడ్ చేసినాడని అతనికి లోడ్ చేయమని ర్యాంపులో సూపర్వైజర్ గా పని చేసే సతీష్ రెడ్డి ఫోన్ చేసి చెప్పినాడని తెలిసినది.అలాగే కర్నాటి శివశంకర్ గురించి తెలుసుకొని హైదరాబాద్ హయత్ నగర్ లోని అతని ఇంటి వద్దకు వెళ్లగా నేరం ఒప్పుకొని వే బిల్లులు తానే తయారు చేసే వాడిని దానికి ఉపయోగించే LAPTAP మరియు ప్రింటర్ అలాగే రామానుజవరం సంబంధించిన స్టాంపును స్వాధీనం చేసుకోవడం జరిగింది. శివశంకర్ తనకు వే బిల్లు తయారు చేయడంలో తన ఊరు సంస్థాన్ నారాయణపురం మండలం యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాకకు చెందిన కిరణ్ అనే అతను వే బిల్లులు తయారు చేయడం నేర్పించినాడని,అంతకుముందు కిరణ్ పై 2023వ సంవత్సరంలో నకిలీ వే బిల్లుల తయారు చేసినందుకు వరంగల్ జిల్లా మట్వాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయి జైలుకు కూడా వెళ్లినాడని తెలిపినాడు.తాను కిరణ్ కలిసి పలు రీచ్లకు సంబంధించిన నకిలీ వే బిల్లులు తయారు చేసి పలుమార్లు ఇసుక అక్రమ రవాణా చేసినామని తెలిపినాడు.


*అరెస్టు కాబడిన వ్యక్తుల వివరములు*


A1- కర్నాటి శివ శంకర్ s/o రాములు, 34 సం''లు, గౌడ, లారీ ఓనర్ R/o పుట్టపాక గ్రామం, సంస్థాన నారాయణపూర్ మండలం, యదాద్రి భువనగిరి జిల్లా..


A4).నాతి రాములు, S/o.నరసింహ రావు, 42yrs, గౌడ, డ్రైవర్ , R/o జనగాం గ్రామం, సంస్థాన నారాయణపూర్ మండలం, యదాద్రి భువనగిరి జిల్లా.


A5) ఇరగదిల్ల ఉపేందర్ S/o ఎల్లయ్య, 35 years,హిటాచి డ్రైవర్ R/o బ్రాహ్మణపల్లి గ్రామం,మహబూబాబాద్ మండలం&జిల్లా.


A6) దగ్గు నిఖిల్ దీప్ S/o రాజేశ్వర్ రావు, 29 years,TGMDC Sand reach Assint. R/o నీరుకుళ్ళ గ్రామం, ఆత్మకూర్ మండలం, హన్మకొండ జిల్లా.


 A7) నాగేల్లి మధు s/o అమరయ్య, 38 ఇయర్స్,TGMDC Sand reach Assint R/o అమీనపురం గ్రామం, కేసముద్రం మండలం,మహబూబాబాద్ జిల్లా.


A8) బోల్లేదు అనిల్ s/o ధర్గయ్య,41 ఇయర్స్,TGMDC Securty గార్డ్ R/o అమీనపురం గ్రామం, కేసముద్రం మండలం,మహబూబాబాద్ జిల్లా.


*పరారీలో ఉన్నవారు*


A-2 E.కిరణ్ (వే బిల్లు తయారు చేసిన వ్యక్తి)

A-3 సతీష్ రెడ్డి( రామానుజవరం ఇసుక ర్యాంపు)

A-9 సుర్వే శ్రీకాంత్ ( లారీ ఓనర్)


ఎవరైనా నకిలీ వే బిల్లులతో ఇసుక అక్రమ రవాణా చేసినా,చేయాలని చూసినా వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది.ఈ కేసులో ఇంకా కొంతమంది అరెస్టు కావలసి ఉన్నందున ఈ కేసులో ఎవరికైనా ప్రమేయం ఉంటే వారిని అరెస్టు చేయడం జరుగుతుంది.ఈ కేసుకు సంబంధించిన వివరములు గాని నకిలీ వే బిల్లుల గురించిన వివరములు గాని ఎవరికైనా తెలిసినట్లయితే వెంటనే అశ్వాపురం SHO సెల్ No. 8712682093,SDPO మణుగూరు సెల్ నెంబర్. 8712682006 గారిని సంప్రదించగలరు.


V.Ravinder Reddy

SDPO,Manuguru

Post a Comment

కొత్తది పాతది