వరంగల్: లొంగిపోయిన మావోయిస్టు నాయకుడు రూబెన్

G Rajashekar
By -
0

 


వరంగల్‌, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


నిషేధిత సీ.పి.ఐ మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీ కార్యదర్శి, సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ సభ్యుడు, దండాకారుణ్య స్పెషల్ జోన్ కమిటీకి చెందిన మంద రూబెన్ మంగళవారం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఎదుట లొంగిపోయారు. హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం వంగపాడు గ్రామానికి చెందిన రూబెన్, 1979లో మావోయిస్టు పార్టీలో చేరి, 1981 నుండి 1986 వరకు కార్యకలాపాలు నిర్వహించారు. 1987లో ఏరియా కమిటీ సభ్యుడిగా, 1992లో తిరిగి పార్టీలో చేరి ఏరియా కమిటీ సభ్యుడిగా పనిచేశారు. అనారోగ్యం, మావోయిస్టు సిద్ధాంతాలపై నమ్మకం తగ్గడం, ప్రజల్లో వ్యతిరేకత, తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాలతో కుటుంబంతో సుఖంగా జీవించాలనే ఆకాంక్షతో లొంగిపోయినట్లు సీపీ తెలిపారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)