పినపాక: బిఆర్ఎస్ లోకి చేరికల జోరు...

G Rajashekar
By -
0




పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


కేసీఆర్ ప్రభుత్వం గతంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు గుర్తించి పార్టీలో వివిధ పార్టీల నుంచి చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు . మంగళవారం పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్డులో పార్టీ కార్యాలయం వద్ద దుగినేపల్లి నుంచి 20 కుటుంబాలు ఆయన సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. 





ఈ చేరికతో గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ బలం మరింతగా పెరిగిందని రేగా కాంతారావు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి దిశగా కృషి చేసే పార్టీగా బిఆర్ఎస్ నిలుస్తుందని ఆయన అన్నారు.



గ్రామ ప్రజలు రేగా కాంతారావు నాయకత్వంపై విశ్వాసం ఉంచి పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు తెలపడం ఆనందకరమని స్థానిక నేతలు తెలిపారు.



ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సతీశ్ రెడ్డి, సీనియర్ నాయకులు వాసు బాబు, తదితరులు పాల్గొన్నారు.



 

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)