తుమ్మల చెరువు తూములు తీసిన ఆయకట్టు రైతులు..

G Rajashekar
By -
0




అశ్వాపురం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

 అశ్వాపురం మండలంలోని కాకతీయుల కాలం నాటి సుప్రసిద్ధ సాగునీటి వనరైన తుమ్మలచెరువు లో 14 అడుగులు నీరు వచ్చి చేరినందున ఖరీఫ్ సీజన్ కొరకు ఆయకట్టు రైతులు ఈరోజు తూములు తీయడం జరిగింది. తుమ్మల చెరువులో నీరు సరిపడు రానందున ఆయకట్టు రైతులు నీటిని వృధా చేయకుండా చివరి భూములకు అందే విధంగా రైతులు సహకరించాలని కోరడం జరిగింది. తుమ్మల చెరువు కింద గల మూడు ప్రధాన కాలువైన కుందారం,చదలవాడ,ఊరవాయ కాలువల కింద రైతులు కాలువలను శుభ్రంగా చేసుకొని వీటిని వృధా చేయకుండా ఆయకట్టు భూములకు అందే విధంగా చూడాలని రైతులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొండికుంట మాజీ సర్పంచ్ మర్రి మల్లారెడ్డి ఆయకట్టు రైతులు బద్దం వెంకట్ రెడ్డి , రుణబోతుల రామ్ రెడ్డి,పుల్సాని సత్యనారాయణ రెడ్డి, మారాసు సత్యనారాయణ,ముద్దం సైదిరెడ్డి, దండి నాగేశ్వరరావు తదితర రైతులు పాల్గొన్నారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)