మూడుముక్కలాటలో బలి పశువు అయ్యేది ఎవరు...??

 


_విచారణ చేపట్టేది పోలీస్ అధికారులా...? పెయిడ్ ఆర్టికల్ పత్రికలా...?


_ముక్కలాటలో పట్టుబడ్డ బిఆర్ఎస్ నాయకుడి కట్టు కదేనా వార్త కథనాల్లో ఉన్నది....


_త్వరలో బయటపడనున్న మూడుముక్కల బాగోతం...


_ మణుగూరు డిఎస్పి వెంటనే విచారణ చేపట్టి నిజాలు నెగ్గు తీర్చాలని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు....



పినపాక:మూడు ముక్కలాటలో బలి పశువు ఎవరు? 


పినపాక , ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


కరవమంటే కప్పకు కోపం..విడవమంటే పాముకు కోపం..అన్నట్లు ఉంది మండలంలోని అధికారుల పరిస్థితి. ప్రజా సమస్యలపై స్పందించాల్సిన అధికారుల విక్షణాధికారాలకు అటు అధికార పక్షం, ఇటు విపక్షం అడ్డు తగులుతూ వారి విధులను కూడా వీరే శాసించే పరిస్థితుల్లో ఉంటే అధికారులు ముందరి కాళ్ళకు బంధం తో పనులు చేసేదెట్ట అంటూ నిట్టూరుస్తున్నారు.


 ఇందుకు ఉదాహరణ గా ఇటివల టాస్క్ఫోర్స్ దాడుల్లో పేకాటలో పట్టుబడ్డ ఓ బీ ఆర్ ఎస్ నాయకుడు సంబంధిత ఎస్సై ఎస్ఐ తమకు వ్యతిరేకంగా వ్యవహించారనే అనుమానంతో ఓ బినామీ పత్రికలో కట్టు కథనంతో విషపు రాతలు గత రెండు రోజులుగా కొన్ని పత్రికలో రాయిస్తున్నారు. మొన్నటి వరకు అధికార దాహం, దర్పాని కి అలవాటు పడిన సదరు వ్యక్తి పేకాట లో పట్టుబడటం వెనుకాల అధికార పార్టీ హస్తం ఉందనే ఉద్దేశ్యం తో విధుల్లో భాగంగా తన విధుల మేరకు కేసు నమోదు చేయడాన్ని జీర్ణించుకోలేక ఎస్ఐ పై విషపు పూతల కుట్ర పన్నారు.


 అయితే ఈ పేకాట స్థావరాలపై దాడుల్లో పట్టుబడ్డ వారిని విచారణ అంతా తమకు అనుకూలంగా నడవాలని ఆ అధికారిని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. 


ఈ విషయమై మణుగూరు డిఎస్పి కార్యాలయంలో మణుగూరు, పినపాక కరకగూడెం మండలాల్లో పేకాట నిర్వాహకులపై విచారణ చేపట్టారు. నేటి వార్త కథనం చూశాక పోలీస్ వారికి దిమ్మతిరిగేలా ఉంది.. విచారణ చేపట్టింది పోలీస్ అధికారైతే ఈ విచారణ అంతా తామే దగ్గరుండి చూసినట్లు పేకాట నిర్వాహకులు సదరు అధికారులకు సొమ్ములు ముట్ట చెబుతున్నట్లు వారు ఒప్పుకున్నట్లు వీళ్లే నిర్ధారించి పోలీసులను బదనం చేస్తూ విష ప్రచారం చేస్తూ ఆ పత్రికలో వచ్చినవా వార్త కథనం పూర్తిగా తప్పుడు వార్త అని పోలీసు వర్గాలు మాట్లాడుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం.


అంతిమంగా పట్టుబడ్డ బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు (ఆ పత్రిక) ఎస్ ఐ ను కేంద్ర బిందువు గా, టార్గెట్ చేసుకుని విషపు అబద్ధపు రాతలు రాయిస్తున్నారనేది బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ఈ కథ ముగింపు పలకాలంటే ఆ పేకాట రాయుడు, నిజ నిర్ధారణ లేకుండా ఒక అధికారిని బదనం చేస్తూ వార్త కథనాలు అందించిన సంబంధిత పత్రికా విలేకరిని ఎస్సై రాజ్ కుమార్ ని జిల్లా ఎస్పీ, పోలీస్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని. అసలైన దోషులను కఠినంగా శిక్షించాలనే ఆసక్తి ప్రజల్లో నెలకొన్నది.


అయితే సదరు జిల్లా స్థాయి అధికారి నిర్ణయం సహేతుకంగా ఉంటేనే ఏ అధికారి అయినా ఖచ్చితంగా తమ విధులను తాము నిర్వర్తిస్తారు.


లేని పక్షంలో ఈ మూడు ముక్కలాటలో బలి పశువు ఎవరు అనేది చెప్పక్కర్లేదు అనుకుంటా..!!!

Post a Comment

أحدث أقدم