ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
నిజాయితీకి మారుపేరు ఎస్ఐ రాజ్ కుమార్
డీజీపీ చేతల మీదుగా రివార్డ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రాజ్ కుమార్ కి అరుదైన గౌరవం దక్కింది. మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా ఆయనకు డీజీపీ చేతుల మీదుగా రివార్డు అందుకున్నారు.
ట్రాఫిక్ నిబంధనలు, మాధకం ద్రవ్యాల గురించి నిత్యం ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారని చెప్పొచ్చు. సమస్య ఉందని ఎవరైనా పోలీస్ స్టేషన్ కి వెళితే న్యాయం చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక మార్క్ ఏర్పరచుకున్నారు.
దొంగతనాలు, యాక్సిడెంట్ చేసేవారు, గంజాయి తరలించే వారిని ఎస్ఐ రాజ్ కుమార్ చాకచక్యంగా పట్టుకొని కటకటాల్లోకి పంపడంలో ప్రత్యేక నైపుణ్యం కనబరుస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఫ్రెండ్లీ పోలీసులా ప్రజల్లోకి వెళుతూ.. నిజాయితీకి మారుపేరులా... అంకితభావంతో పనిచేస్తూ, ఎలాంటి సవాళ్ళు ఎదురైనా... పరిష్కరించే దిశగా... నిందితుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా విధులు నిర్వహిస్తూ... ఎస్సై రాజ్ కుమార్ ప్రత్యేక గుర్తింపు సాధించారనే చెప్పాలి. అతనిని సిఐ వెంకటేశ్వరరావు, పోలీస్ సిబ్బంది, తదితరులు అభినందించారు.
ఇది కూడా చదవండి... బిగ్ బ్రేకింగ్ న్యూస్... 11 కేజీల గంజాయి పట్టివేత
Good job in your life sir also you are good officer 🙏🙏🙏❤️🎉❤️
రిప్లయితొలగించండికామెంట్ను పోస్ట్ చేయండి