మణుగూరు: బీటీపీఎస్ గేట్ ముందు ఆదివాసుల ధర్నా..

 


మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం మెయిన్ గేట్ నందు శుక్రవారం ఆదివాసి నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... స్థానికంగా ఉన్న ఆదివాసి బిడ్డలకు, భూములు కోల్పోయిన నిరాశ్రయులకు తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. బూడిద చెరువు నుంచి వచ్చే నీటి వల్ల పంట పొలాల మీద ప్రభావం పడుతుందని  తెలిపారు. పవర్ ప్లాంట్ కు దగ్గర్లో ఉన్న గ్రామాలకు రోడ్ల సదుపాయం కల్పించాలని, ఆస్పత్రి, బస్టాండ్ నిర్మించాలన్నారు. లేనియెడల ధర్నాని ఇంకా ఉధృతం చేస్తామని డిమాండ్ చేస్తున్నారన్నారు. ఆదివాసి మహిళలు తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

కొత్తది పాతది