రజతోత్సవ సభకు తరలివచ్చిన బిఆర్ఎస్ శ్రేణులకు ధన్యవాదాలు....మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి


 

పినపాక: ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:  


ఏప్రిల్ 27 వరంగల్ లో ఆదివారం జరిగిన బిఆర్ఎస్ రజతోత్సవ సభకు పినపాక నుండి హాజరైన బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకి ధన్యవాదాలు తెలియజేస్తూ మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన మంగళవారం ఈ బయ్యారం అడ్డరోడ్డులోని బిఆర్ఎస్ కార్యాలయంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడాతూ...పినపాక మండలం నుండి బిఆర్ఎస్ పాతికేల్ల పండుగకు 76 కార్లు 9 టాటా మ్యాజిక్లలో నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లి రజతోత్సవ గ్రాండ్ సక్సెస్ లో పాలుపంచుకున్నారని అన్నారు. ఈ సభతో కాంగ్రెస్ నాయకుల వెన్నుల లో వణుకు పుడుతుందని అన్నారు సభను ఫెయిల్యూర్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన రాష్ట్రం నలుమూలల నుండి చీమలదండులా బిఆర్ఎస్ శ్రేణులు సభకు తరలి వచ్చి విజయవంతం చేశారని అన్నారు .రజతోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ను చూసి కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడాలో అర్థం కాక తలలు పట్టుకుని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు .ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుమ్మడి గాంధీ పిఎసిఎస్ చైర్మన్ వర్మ సీనియర్ నాయకులు భవాని శంకర్, భద్రయ్య, వాసు బాబు , బత్తుల వెంకటేశ్వర రెడ్డి ,వెంకటేశ్వర రెడ్డి, సత్తిబాబు మహేష్ సురేందర్,తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم