సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 10 వ తరగతి ఫలితాలు విడుదల...
నేడు మధ్యాహ్నం 1:00 కి ఫలితాలు..
తెలంగాణ బోర్డు అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏప్రిల్ 30 వ తారీఖు మధ్యాహ్నం 1:00 కి పదవ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది.
పరీక్ష ఫలితాల కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://bse.telangana.gov.in/
ఈ సంవత్సరం 11,547 పాఠశాలల నుండి మొత్తం 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలకు నమోదు చేసుకున్నారు, వీరిలో 2,58,895 మంది బాలురు మరియు 2,50,508 మంది బాలికలు ఉన్నారు. పరీక్షలను సజావుగా మరియు నిష్పాక్షికంగా నిర్వహించడానికి, బోర్డు 2,650 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 2,650 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు మరియు 28,100 మంది ఇన్విజిలేటర్లను నియమించింది.
إرسال تعليق