అశ్వాపురం మండలం ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెం ఉమ్మడి గ్రామపంచాయితీ పరిధిలోని మరియు తుమ్మల చెరువు గ్రామపంచాయితీ పరిధిలోని తిరుమలమ్మ మాలాధారణ భక్తులు ఈరోజు మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజాభవన్ లో ఎమ్మెల్యే పాయం గారిని మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలను వినిపించారు గొందిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మా భక్తులకు నిలయంగా ఉంటూ ఆదివాసి గూడేలలో దైవభక్తి భావజాలాన్ని వ్యాపింప చేస్తూ ప్రజలలో భక్తి భావాలను మానవతా విలువలను నింపుతున్నది కానీ సరదు దేవాలయము గజ స్థంభం కూలిపోయినది మరియు నీటి సదుపాయం కూడా లేదు అని కావున మా యందు దయతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బోర్వెల్ వేయించ గలరని ధ్వజస్తంభం తిరిగి నిర్మించాలని *ఎమ్మెల్యే పాయం* గారికి వినతి పత్రం అందజేసిన తిరుపతమ్మ మాలధార భక్తులు ఈ యొక్క కార్యక్రమానికి గురు స్వామి గొంది గోపాలకృష్ణ, పాయం సర్వేశ్వరరావు, కందుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
