బల్దియా ముందు మృతదేహంతో ఆందోళన
ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;
అవినీతి అక్రమాలతో వర్థిల్లుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వరంగల్ బల్దియాలో విషాదం చోటుచేసుకుంది. డీజిల్ కుంభకోణం లో ఆయన పాత్ర ఏమేరకు ఎంతుందో బయటికి రాలేదు కాని సామాన్య ఉద్యోగి మాత్రం కళ్ళముందు కన్ను మూసాడు. బల్దియాలో అనేక శాఖలు ఆరోపణలు ఎదుర్కొంటున్నా వాటిని పట్టించుకోని అధికారులు కొందరు రఘును శిక్షార్హుడిగా ప్రకటించారు. దీనితో ఆయన అవమానం తట్టుకోలేక గుండె ఆగి చనిపోయడని పలువురు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రఘును సస్పెండ్ చేసిన అధికారులు ఏం సమాధానం చేబుతారని ప్రశ్నిస్తున్నారు. మృతుడు రఘు కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు, సిబ్బంది డిమాండ్ చేశారు. ఈ మేరకు రఘు మృతదేహంతో కార్పొరేషన్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి