ఆదర్శ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. ఏడుగురు విద్యార్థినులకు అస్వస్థత
ఎన్కౌంటర్ బుల్లెట్ న్యూస్:
తెలంగాణలో మరోసారి ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. తాజాగా మంగళవారం నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం దుగ్యాల మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత ఏడుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారు ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు విపరీతమైన కడుపు నొప్పి రావడంతో గిలగిలా కొట్టుకున్నారు. ఇది గమనించిన టీచర్లు వారిని హుటాహుటిన దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
إرسال تعليق