మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
సింగరేణి డాంప్ యాడ్ వల్ల మణుగూరు కు ముప్పు ముందుగానే గ్రహించిన పినపాక శాసనసభ్యుడు….
సింగరేణి అధికారులు ముదస్తు చర్యలు విఫలం..
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముందస్తు చర్య వల్ల గాంధీనగర్ ప్రాంతం కు తప్పిన ప్రమాదం..
గాంధీనగరం వెనుక సింగరేణి అధికారులు ఏర్పాటు చేసిన అలుగు కట్ట తెగడం తో వాగులోకి తిరిగిన ప్రవాహం..
ఎమ్మెల్యే ముందు జాగ్రత వల్ల మంచి జరిగినట్లు తెలుపుతున్న మణుగూరు వాసులు …
ఒక ప్రజాప్రతినిధి నిజంగా ప్రజల సంక్షేమాన్ని ఎలా గుర్తుంచుకుంటాడో… ప్రమాద సమయంలో ఎలా స్పందించాలో మణుగూరు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు మరోసారి నిరూపించారు. సింగరేణి డంపింగ్ యార్డ్ వల్ల మణుగూరు పట్టణానికి ఏర్పడిన భారీ వరద ముప్పును ఆయన ముందస్తు జాగ్రత్త చర్యల ద్వారా సమర్థవంతంగా సమర్థించగలిగారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరులో కురిసిన భారీ వర్షాల కారణంగా సింగరేణి సంస్థ ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ వద్ద అలుగు కట్ట తెగిపోవడం వల్ల గాంధీనగర్ ప్రాంతానికి భారీ ప్రమాదం పొంచి ఉంది. అయితే, పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అధికారులకు తక్షణ సూచనలు చేస్తూ, ప్రజలపై విపత్తు తలపోకుండా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ “ఎమ్మెల్యే గారి చొరవ లేకపోతే గాంధీనగర్, అశోక్ నగర్ ప్రాంతాలు బహుశా తడిసి ముద్దయ్యేవి. ఎటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడేది. కానీ ఆయన సమయస్ఫూర్తితో మేము రక్షించబడ్డాం” అని అభినందించారు. వైపు ప్రవహించిన వరద నీరు సింగరేణి GM కార్యాలయం నుంచి మణుగూరు ప్రధాన రహదారి పై ప్రవహించి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించింది. ప్రజలు తీవ్రమైన అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు.
ఈ క్రమంలో సింగరేణి అధికారుల నిర్లక్ష్యం, ముదస్తు చర్యలలో విఫలం వంటి అంశాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిపుణుల అంచనా ప్రకారం –
“ఘటన మరింత విషమిస్తే గాంధీనగర్, అశోక్ నగర్ ప్రాంతాలపై పూర్తి వరద ప్రభావం ఉంటేది. పెను ప్రాణ నష్టం తప్పేది కాదు” అని వ్యాఖ్యానించారు.
పాయం వెంకటేశ్వర్లు గారు స్పందించిన తీరు ప్రజల నమ్మకానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. ప్రజలతో క్షేత్రస్థాయిలో మమేకమై, వారి శ్రేయస్సు కోసం తీసుకున్న చర్యలు పాలకులకు ఒక మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.
إرسال تعليق