గ్రేట్... ఆదివాసి గూడెంలో ఆహార పొట్లాల పంపిణీ

 





దానధర్మా ట్రస్ట్ చైర్మన్ గంటా రాధా 


మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని విజయనగరం వద్ద ఉన్న ఆదివాసీ గూడెం "పెద్దపల్లి"లో దానధర్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సేవా కార్యక్రమాన్ని ట్రస్ట్ చైర్మన్ గంటా రాధా స్వయంగా చేపట్టి, గూడెంలో ఉన్న పేద కుటుంబాలకు అన్నపొట్లాలు పంపిణీ చేశారు.


ఈ సందర్భంగా గంటా రాధా మాట్లాడుతూ, ఇది సేవ కాదు, నా బాధ్యత” అన్నారు.


ఆమె తన స్వంత ఖర్చులతో చేసిన ఈ కార్యక్రమం గూడెంలో ఉన్న పెద్దలూ, చిన్నవాళ్లూ ఎంతో కృతజ్ఞతతో స్వీకరించారు.ఆకలితో ఉండే చిన్నారులకు ఒక్క పూట అన్నం దొరికిన సంతోషం వారి ముఖాల్లో కనిపించింది.


ఇప్పటికే దానధర్మ ట్రస్ట్ ద్వారా మణుగూరు ప్రాంతంలో పలుచోట్ల ఈ తరహా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పేదలు ఆకలితో ఉండకూడదన్న తపనతో గంటా రాధా ఈ పనిని తాను ఎక్కడా ఆపకుండా కొనసాగిస్తానని స్పష్టం చేశారు.


ఒక పూట భోజనంతో కుటుంబాలకు కొంత ఉపశమనం కలుగుతుందని భావించిన ఆమె, ఆ గ్రామానికి పయనమయ్యారు. ఈ కార్యక్రమాన్ని చూసిన గ్రామస్తులు, "ఇలాంటి సేవలు చేయడానికి కూడా మనసు కావాలి. ఇది నిజమైన మానవత్వం," అంటూ ఆమెను అభినందించారు.సేవే నిజమైన ధర్మమని నమ్మే గంటా రాధా చేస్తున్న పని ఈరోజు ఎంతో మందికి ఆదర్శంగా మారుతోంది..

Post a Comment

أحدث أقدم