ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పులతో అబుజ్‌మార్ అటవీ ప్రాంతం దద్దరిల్లింది.
నారాయణపూర్‌లో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు ఎదురు పడటంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి జరుగుతున్న ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించినట్లు తెలుస్తోంది. ఆరుగురి మృతదేహాలతో పాటు.. ఏకే 47, ఎస్ఎల్ఆర్ రైఫిల్స్, పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.
కాగా.. *ఎన్కౌంటర్లో హతమైన మావోయిస్టుల వివరాలు ఇంకా వెల్లడించలేదు.* ఆపరేషన్ ముగిసిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతుండగా.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆపరేషన్ కగార్ లో భాగంగా ఇప్పటికే అనేక మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మరణించారు.
إرسال تعليق