సీతారామ ప్రాజెక్ట్ కాలువలో ఈతకు వెళ్లిన యువకుడు గల్లంతు..




బూర్గంపాడు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


బూర్గంపాడు మండలం పాత పినపాక (పినపాక పట్టి నగర్) సమీపంలోని సీతారామ ప్రాజెక్ట్ కాలువలో ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులలో ఒకరు గల్లంతు అయినట్లు సమాచారం... పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది...



Aslo Read..



కాంగ్రెస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలి...

 బిఆర్ఎస్ నాయకుల చిల్లర రాజకీయాలు మానుకోవాలి...

పినపాక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోడిశాల రామనాథం...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని కొందరు బిఆర్ఎస్ నాయకులు పనిగట్టుకుని కాంగ్రెస్ పార్టీపై అసత్య ఆరోపణలు చేయడం వారి స్థాయిని దిగజార్చుకునే ప్రయత్నం అని కాంగ్రెస్ పార్టీ పినపాక మండల అధ్యక్షుడు గోడిశాల రామనాథం అన్నారు. గత కొన్ని రోజులుగా మండల వ్యాప్తంగా జరుగుతున్న పేకాట స్థావరాలపై దాడులకు సంబంధించి మండల కాంగ్రెస్ పార్టీ పై తప్పుడు ప్రచారాలు చేస్తున్న నేపథ్యంలో ఇదంతా కాంగ్రెస్ పార్టీని అభాసపాలు చేయాలని దురుద్దేశంతో బిఆర్ఎస్ నాయకులు ఆడుతున్న నాటకమని మండల ప్రజలు గమనిస్తున్నారని, పేకాట రాయలుగా పేరుపొందిన ప్రతిపక్ష పార్టీ నాయకులు రానున్న స్థానిక ఎన్నికల్లో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడబోతుందని ఇటువంటి నాయకులకు ప్రజలు తగిన గుణపాఠం రానున్న స్థానిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కనీసం సభ్యత్వం లేని వారిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా ప్రకటించి పబ్బం గడుపుకునే కుటిల రాజకీయాలను బిఆర్ఎస్ నాయకులు మానుకోవాలని కనీస జ్ఞానం లేకుండా ప్రవర్తించే ప్రతిపక్ష పార్టీ నాయకులకు చంపపెట్టుగా స్థానిక ఎన్నికలే తగిన గుణపాఠం త్వరలో చెబుతామని తెలిపారు....




 


Also read...తెలంగాణ రాష్ట్రంలో క్షణికావేశంలో పారాక్వాట్ తాగి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది 





 లోక్ సభలో 377 నిబంధన కింద ప్రస్తావించిన ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి 




ఢిల్లీ, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్: 




తెలంగాణ రాష్ట్రంలో పంటల సాగులో కలుపు నివారణకు వినియోగించే అత్యంత విషపూరితమైన పారాక్వాట్ అనే గడ్డి మందును క్షణికావేశంలో తాగి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని.. కేంద్ర ప్రభుత్వం దీనిని నిషేధించాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో కోరారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా.. బుధవారం 377 నిబంధన కింద ఈ అంశాన్ని ప్రస్తావించారు. వైద్య చికిత్సలో విరుగుడు లేక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రాణాలు కోల్పోతున్న రైతులు, వ్యవసాయ కూలీలు, యువకుల సంఖ్య ఆందోళన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 


60కి పైగా దేశాల్లో నిషేధం


పారాక్వాట్ పై 60 కి పైగా దేశాలు నిషేధం విధించాయని తెలిపారు. దీని వినియోగంతో పర్యావరణానికి కూడా ముప్పు పొంచి ఉందని, గోధుమలు, పప్పు ధాన్యాలు వంటి ప్రధాన పంటల్లో ఈ గడ్డి మందు అవశేషాలు గుర్తించారని, ప్రజల ఆరోగ్యానికి కూడా హాని పొంచి ఉందని పేర్కొన్నారు. పారాక్వాట్ కు ప్రత్యామ్నాయ మందును అందుబాటులోకి తెచ్చి.. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని..ఈ సందర్భంగా కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాను కోరారు. గడ్డి మందు నిషేధంపై కేంద్రం తీసుకునే నిర్ణయాత్మక చర్య మన వ్యవసాయాన్ని, సమాజ గౌరవాన్ని నిలబెడతాయని ఎంపీ రఘురాం రెడ్డి సూచించారు.

Post a Comment

أحدث أقدم