పినపాక మండల ప్రజలకు ఏడూళ్ల బయ్యారం పోలీస్ వారి హెచ్చరిక : ఎస్ఐ సురేష్




పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:



గత 24 గం ల నుండి ఆగకుండా వర్షాలు కురుస్తున్నాయి, మరో రెండు రోజులు కూడా ఇదేవిధంగా భారీ వర్షాలు పడతాయి అని వాతావరణ శాఖ చెప్తుంది. కావున మండల ప్రజలు ఎవరూ అత్యవసరం అయితే తప్ప బయటకి రావొద్దు, వర్షాలు పడుతున్న సమయంలో బహిరంగ ప్రదేశాల్లో గాని చెట్ల కింద గాని ఉండకూడదు పిడుగులు పడే అవకాశం ఉంది, *Damini* అనే free application ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుంటే మనం ఉన్న చోట పిడుగులు పడే అవకాశం ఉంటే ముందుగానే మనల్ని అలర్ట్ చేస్తుంది, ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోకూడదు, కరెంటు స్తంబాలు/పోల్స్ మరియు కరెంటు తీగల నుండి దూరంగా ఉండండి, కనీస నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేలా చూస్కోండి, నెలలు నిండిన గర్భిణీ స్త్రీలు సురక్షిత వైద్య సదుపాయం సమీపంలో లో ఉండేందుకు ప్రయత్నించండి.ముంపు ప్రాంతాల ప్రజలు గోదావరి ఉదృతి ని బట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి,వరద ఎక్కువ ఉంటది కాబట్టి చేపలు పట్టేందుకు వెళ్ళకండి,

చివరగా మండలం లో ఎక్కడైనా రోడ్ల మీదుగా వరద నీరు ప్రవహించినా, రాకపోకలు రద్దు అయినా పోలిస్ కి సమాచారం అందించండి.



ఇట్లు 

SI SURESH E-BAYYARAM PS

Post a Comment

أحدث أقدم