ఓయమీర్ పెళ్లి కబురు ...! కోయ భాషలో పెళ్లి పత్రిక

    



ఆవిష్కరించిన ఐటీడీఏ పీవో  


ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్: భద్రాచలం

                                               


కోయ భాషలో పెళ్లి పత్రిక వచ్చేసింది. ఇప్పటివరకు తెలుగులో శుభలేఖలు వేసుకున్న ఆదివాసీలు ఇక తమ వాడుక భాష అక్షర రూపం దాల్చడంతో నూతన సరళికి శ్రీకారం చుట్టారు. ఆదివాసీ వాడుక భాషను లిపి రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేసిన భద్రాచలం ఐ.టి.డి.ఎ సఫలీకృతమైందని చెప్పొచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...పాల్వంచ గ్రామానికి చెందిన కన్న రాజు అనే ఆదివాసి యువకుడికి భద్రాచలం జగదీష్ కాలనీకి చెందిన పూనే లక్ష్మీ శరణ్యతో ఆగస్టు 3న వివాహం ముహూర్తం ఖరారు చేశారు.ఈ క్రమంలో వీరి వివాహ వేడుక సంబంధించి కళ్యాణ ఆహ్వాన పత్రికను పూర్తిగా కోయ భాషలో ముద్రించారు. ఈ కళ్యాణ ఆహ్వాన పత్రిక చూడముచ్చటగా ఉంది.పందీర్ ముహూర్తం, పెళ్లి మూర్తం, మా సొంత నార్,కబూర్, కరంగానూర్ ఇయాల్ అంటూ...కోయ భాషలో శుభ ఘడియలు,వేదిక,విందు, ఆహ్వానించువారు ఈ పదాలను పొందుపరిచి భళా..ఆదివాసీ శుభ కళ్యాణ పత్రిక అనేలా రూపొందించారు. కళ్యాణ పత్రిక పై భాగాన భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ ఐఏఎస్ ప్రేరణతో 'కోయ భాషలో పెళ్లి శుభలేఖ అంటూ ముద్రించి పి.ఓ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. సోమవారం ఈ ఆహ్వాన పత్రికను భద్రాచలం ఐటీడీఏ పీవో ఛాంబర్ లో  పిఓ రాహుల్ ఐఏఎస్ ఆవిష్కరించారు. కోయ భాష దినోత్సవం రోజునే కోయ భాషలో ఉన్న ఈ ఆహ్వాన పెళ్లి పత్రికను ఆవిష్కరించడం గమనార్హం. 

ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో రాహుల్ మాట్లాడుతూ... కోయ భాషలో ఉన్న పెళ్లి పత్రికను చూడటం ఆనందకరంగా ఉందన్నారు. గిరిజనుల మాతృభాషలో లిపి అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. ఇందుకోసం భద్రాచలం ఐటిడిఏ ఎంతగానో చర్యలు తీసుకుందన్నారు. అంతరించిపోతున్న ఆదివాసి గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు భవిష్యత్తు తరాలకు అందించే ప్రయత్నంలో భాగంగానే భద్రాచలంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆదివాసీల సంస్కృతిపై ప్రత్యేక అధ్యయనం చేసి ఆదివాసి తెగల ఇలవేల్పుల చరిత్రను సేకరిస్తున్నామన్నారు. నేటితరం గిరిజన బాలబాలికలకు, యువతి యువకులకు వారి భాష పై మక్కువ కలిగేలా ఐటీడీఏ ద్వారా నిర్వహిస్తున్న స్వాతంత్ర దినోత్సవ వేడుక, గణతంత్ర దినోత్సవం వేడుక, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా అందించే ఆహ్వాన పత్రికలు, ప్రభుత్వ ఉద్యోగులకు అందించే ప్రశంసా పత్రాలు కోయ భాషలోనే ముద్రించి పంపిణీ చేయడం జరిగిందని పిఓ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఐటీడీఏ పరిపాలన అధికారి సున్నం రాంబాబు మరియు గిరిజన మహిళలు, పురుషులు తదితరులు పాల్గొన్నారు.

1 تعليقات

إرسال تعليق

أحدث أقدم