ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలో రైతు మృతి.. భూ సమస్య పరిష్కారం కాలేదని మనస్తాపం.

G Rajashekar
By -
0

 



కోయిలకొండలో విషాదం.. అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని కుటుంబ సభ్యుల వాదన


EB NEWS/కోయిలకొండ: 


మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలంలో ఓ రైతు మృతి చెందడం విషాదం నెలకొంది. పారుపల్లి గ్రామానికి చెందిన లవప్ప (53) ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలో మృతి చెందినట్లు సమాచారం.


స్థానికుల వివరాల ప్రకారం.. లవప్పకు వంశపారంపర్యంగా 19 ఎకరాల భూమి ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 18 ఎకరాలు మాత్రమే తన ఆధీనంలో ఉన్నాయని అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన ఎకరం భూమి పొరుగు రైతుల ఆధీనంలో ఉందని ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.


భూమికి సంబంధించిన సమస్యను పరిష్కరించాలని లవప్ప కొంతకాలంగా అధికారులను కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఈ క్రమంలో ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలో చెట్టుకు ఉరేసుకుని మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.


ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. భూ వివాదం కారణంగానే ఈ ఘటన జరిగిందా? అనే అంశంపై అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)